రేపే 'పందెం కోడి 2' ట్రైలర్ రిలీజ్..
- September 27, 2018
మాస్ హీరో విశాల్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పందెంకోడి 2'. గతంలో మాస్ హీరో విశాల్, ఎన్.లింగు స్వామి కాంబినేషన్లో వచ్చిన 'పందెంకోడి' సూపర్ డూపర్ హిట్ అయి విశాల్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'పందెంకోడి 2'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ రోజు ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న 'పందెంకోడి 2' చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు ఠాగూర్ మధు తెలిపారు. కాగా ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 29న విడుదల చేయనున్నారు.
మాస్ హీరో విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాతలు: విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







