అక్టోబర్ 11న విడుదల కి ముస్తాబవుతున్న అరవింద సమేత.!
- September 27, 2018
జూ.ఎన్టీఆర్కు సక్సెస్లు కొత్త కాకపోయినా సినీరంగంలో ట్రెండ్ మారిన నేపథ్యంలో ఏ సినిమాకు ఆ సినిమా విజయాన్ని పరిగణలోనికి తీసుకుంటున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ వంటి నాలుగు వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న ఆయన నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత (వీరరాఘవ ఉపశీర్షిక) చిత్రంపై కూడా భారీ అంచనాలతో ఉన్నారు. పైపెచ్చు త్రివిక్రమ్, ఎన్టీఆర్ల కలయికలో ఇది తొలి చిత్రం కావడం కూడా అంచనాలకు కారణమైంది. ఎన్టీఆర్ ఇమేజ్ను.అలాగే తనదైన స్కూలును దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్కు పూజాహెగ్డే జోడీ కట్టగా.హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ఇటీవల స్విస్, ఇటలీ బోర్డర్లో ఈ చిత్రం కోసం ఓ పాటను చిత్రీకరించుకుని యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకుంది. మరోవైపు నిర్మాణానంతర పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని చెబుతున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలన్న లక్ష్యంతో చిత్రబృందం ముందుకు సాగుతోంది. ఈషా రెబ్బ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, నవీన్చంద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఛాయాగ్రహణాన్ని పి.ఎస్.వినోద్, సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







