హౌతీ మిస్సైల్‌ని కూల్చివేసిన సంకీర్ణ దళాలు

- September 28, 2018 , by Maagulf
హౌతీ మిస్సైల్‌ని కూల్చివేసిన సంకీర్ణ దళాలు

సౌదీ అరేబియా:సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు, హౌతీ రెబల్స్‌ పేల్చిన బాలిస్టిక్‌ మిస్సైల్‌ని కూల్చివేయడం జరిగింది. యెమెన్‌ సదరన్‌ పోర్ట్‌ సిటీ ఆఫ్‌ అదెన్‌ వైపుగా ఈ మిస్సైల్‌ని సంధించినట్లు అధికారులు వెల్లడించారు. సౌదీ సంకీర్ణ దళాలకు చెందిన మెయిన్‌ హెడ్‌ క్వార్టర్‌ని తీవ్రవాదులు టార్గెట్‌ చేశారనీ, అయితే వారి వ్యూహాల్ని తిప్పి కొట్టామని సంకీర్ణ బలగాలు ప్రకటించాయి. అదెన్స్‌లోని బురైగా డిస్ట్రిక్ట్‌ వైపు మిస్సైల్‌ని తీవ్రవాదులు సంధించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. సౌదీ సంకీర్ణ దళాలకు, యెమెన్‌తో పోరాడుతున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దళాలకు బురైగా అత్యంత కీలకమైన ప్రాంతం. భారీ పేలుడు శబ్దం తమకు విన్పించిందంటూ స్థానిక ప్రజానీకం పేర్కొన్నారు. యెమెన్‌ ఇన్ఫర్మేషన్‌ మినిస్టర్‌ మువామర్‌ అల్‌ ఇర్యానీ ఈ ఘటనను ధృవీకరించారు. అయితే సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు రెండు మిస్సైళ్ళను కూల్చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com