యూఎన్‌ హెల్త్‌ అవార్డ్‌ అందుకున్న బహ్రెయిన్‌

- September 28, 2018 , by Maagulf
యూఎన్‌ హెల్త్‌ అవార్డ్‌ అందుకున్న బహ్రెయిన్‌

మనామా:బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌, యునైటెడ్‌ నేషన్స్‌ నుంచి ప్రతిష్టాత్మకమైన అవార్డుని గెలుచుకుంది. నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ని డీల్‌ చేయడంలో బహ్రెయిన్‌ ఎంతో ప్రగతి సాధించిందని పేర్కొంటూ, ఈ అవార్డుని బహ్రెయిన్‌కి అందించింది యూఎన్‌. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, ఈ నేషన్స్‌ ఇంటర్‌ - ఏజెన్సీ టాస్క్‌ ఫోర్డ్‌ అవార్డుని దక్కించుకుంది. న్యూయార్క్‌లోని యునైటెడ్‌ నేషన్స్‌ హెడ్‌ క్వార్టర్‌లో మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ వాలిద్‌ అల్‌ మనీయా ఈ అవార్డుని అందుకున్నారు. ఈ ఘనతను సాధించిన తొలి గల్ఫ్‌ కంట్రీగా బహ్రెయిన్‌ రికార్డులకెక్కింది. యునైటెడ్‌ నేషన్స్‌ టీమ్‌ వర్క్‌ అవార్డ్‌ అందుకోవడం ఎంతో గవర్వంగా వుందని మినిస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఫయీకా బిన్‌ సయీద్‌ అల్‌ సలెహ్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com