22 కేజీల బంగారంతో చీర..
- September 28, 2018
కోల్ కతా:దసరా వచ్చిందంటే పశ్చిమబెంగాల్లో దుర్గామాత మండపాలను ఏర్పాటు చేసి సందడి చేస్తుంటారు. ప్రస్తుతం కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపం, అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవైపు లండన్ థీమ్‌తో మండపం అయితే మరోవైపు బంగారంతో తయారు చేసిన అమ్మవారి చీర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
పూజా కమిటీ దుర్గామాత కోసం దాదాపు 22 కేజీల బంగారంతో చీరను తయారు చేయించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పౌల్ ఈ చీరను డిజైన్ చేశారు. దాదాపు 50 మంది నిపుణులు ఈ చీర తయారీకి శ్రమించారు. పువ్వులు, పక్షులు, సీతాకోక చిలుకలు, నెమళ్ల బొమ్మలను చీరపై ఎంబ్రాయిడరీ చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







