రోడ్డు ప్రమాదం: ఇద్దరు బ్రిటిష్ మహిళల మృతి
- September 29, 2018
ఒమన్:సుల్తానేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బ్రిటిష్ మహిళలు ప్రాణాలు కోల్పోగా, ఓ బ్రిటిష్ వ్యక్తి గాయాలపాలయ్యారు. సలాలాలో హఫ్ఫా మార్కెట్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌కి డ్రైవింగ్ లైసెన్స్ లేదని విచారణలో తేలినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఒమన్ టూరిజం మినిస్ట్రీ బాధితుల వివరాల్ని వెల్లడించింది. గాయపడ్డ బ్రిటిష్ వ్యక్తి సమీపంలోని ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుంది. ఒమన్ రాజధాని మస్కట్‌కి 860 కిలోమీటర్ల దూరంలో వుంది సలాలా. ప్రముఖ టూరిజం డెస్టినేషన్‌గా సుల్తానేట్‌లో సలాలా పేరు ప్రఖ్యాతులు గాంచింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి