బిగ్‌బాస్‌ సెట్‌ ముందు కౌశల్ ఆర్మీ హల్‌చల్‌..ఫైనల్ షూట్ నిలిపివేత

- September 29, 2018 , by Maagulf
బిగ్‌బాస్‌ సెట్‌ ముందు కౌశల్ ఆర్మీ హల్‌చల్‌..ఫైనల్ షూట్ నిలిపివేత

బిగ్‌బాస్ సీజన్‌-2 మరి కొన్నిగంటల్లో ముగియనుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన విన్నర్‌ ఎవరు.. రన్నర్‌ ఎవరనే చర్చ. అయితే కౌశల్‌కు మద్దతుగా నిలిచే కౌశల్‌ ఆర్మీ బిగ్‌బాస్‌ సెట్‌ ముందు హల్‌చల్‌ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఈ బిగ్‌బాస్‌ సెట్‌ ముందు శనివారం రాత్రి సుమారు మూడువందల మంది కౌశల్‌ ఆర్మీ సభ్యులు కౌశల్‌.. కౌశల్‌ అని అరుస్తూ హల్‌చల్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రాత్రి జరగాల్సిన ఫైనల్‌ షూట్‌ను బిగ్‌బాస్‌ నిర్వాహకులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com