అక్టోబర్ 1న విడుదల కానున్న సవ్యసాచి టీజర్
- September 29, 2018
నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూమొండేటి తెరకెక్కిస్తున్న సినిమా సవ్యసాచి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని.. కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాగా చెబుతున్నారు దర్శకుడు చందూమొండేటి. ఈ చిత్ర టీజర్ అక్టోబర్ 1 ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. నాగచైతన్య ఇప్పటి వరకు చేయని ఓ కొత్త జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు చందూ. భారతంలో అర్జునుడికి ఉన్నట్లే.. సవ్యసాచిలో హీరోకు కూడా రెండు చేతులకు సమానమైన బలం ఉంటుంది. అందుకే సవ్యసాచి టైటిల్ పెట్టారు. ఈ చిత్రంతోనే మాధవన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. భూమిక చావ్లా, వెన్నెల కిషోర్, సత్య, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యంయం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యేర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరకూరి(సివిఎం) నిర్మిస్తున్నారు. నవంబర్ లో సవ్యసాచి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







