ఈజిప్టు:ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసి జైలుపాలైంది
- September 30, 2018
ఈజిప్టు:ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసినందుకు ఈజిప్టులో ఓ ఉద్యమకారిణికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. అమల్ ఫాతీ అనే మహిళ గతంలో తాను ఏ విధంగా లైంగిక వేధింపులకు గురయ్యానో తెలుపుతూ మే నెలలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇంతటితో ఆగకుండా ఈజిప్టులో నివాస యోగ్య పరిస్థితులపై ఆమె విమర్శలు చేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టడం లేదంటూ వీడియోలో మండిపడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి మీడియా కూడా ప్రసారం చేసింది. దీంతో నకిలీ వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు ఆమెను అరెస్టు చేసి 140 రోజుల పాటు జైలులో ఉంచారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఆమె ఉగ్రవాద ముఠాకు చెందిన వ్యక్తి అని ప్రచారం జరిగింది.
జాతీయ భద్రతకు భంగం కలిగించేలా నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు ఫాతీకి రెండేళ్ల జైలు శిక్ష, 560 డాలర్ల జరిమానా విధిస్తున్నట్లు శనివారం తీర్పు వచ్చింది. తాము ఎలాంటి వదంతులను వ్యాప్తి చేయలేదని ఆధారాలతో నిరూపించినా తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చిందని మానవ హక్కుల ఉద్యమకారుడైన ఆమె భర్త మహమ్మద్ లాఫ్టీ విమర్శించారు. ‘‘లోపాలను ఎత్తి చూపినా శిక్ష వేశారంటే ఈజిప్టులోని మహిళలు ఇకపై నోర్లు మూసుకోవాలి. జైలుకు వెళ్లకూడదంటే ఏమీ మాట్లాడకూడదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







