ఎన్నికల ప్రచారంలో బాలయ్య

- September 30, 2018 , by Maagulf
ఎన్నికల ప్రచారంలో బాలయ్య

ఖమ్మం: సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈక్రమంలో బాలకృష్ణ మధిర మండలం రాయపట్నం చేరుకున్నారు. పర్యటనలో భాగంగా బాలకృష్ణ పలు చోట్ల ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. బోనకల్లు మండలం ఆళ్లపాడు, నారాయణపురంలో ఎన్టీఆర్‌ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం తల్లాడ నుంచి నిర్వహించే ద్విచక్ర వాహనాల ర్యాలీలో బాలయ్య పాల్గొననున్నారు. అనంతరం కిష్టారంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సత్తుపల్లిలో ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు పెనగడప చుంచుపల్లి మండలంలో పర్యటించనున్నారు. కోనేరు నాగేశ్వరరావు ఘాట్‌ వద్ద బాలయ్య నివాళులర్పించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు కొత్తగూడెంలో కోనేరు సత్యనారాయణ నివాసానికి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com