'సవ్యసాచి' టీజర్ విడుదల
- September 30, 2018
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'సవ్యసాచి'. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ సరసన బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా.. సోమవారం 'సవ్యసాచి' టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు.
టీజర్‌లో.. 'ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు. అదే ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకుని పుడితే అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని, వరుసకి కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని, ఈ సవ్యసాచిలో సగాన్ని' అని నాగచైతన్య చెప్పే డైలాగ్ హైలెట్.
మాధవన్, భూమిక ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







