ప్రముఖ సంగీత దర్శకుడు బాలభాస్కర్ ఇకలేరు
- October 01, 2018
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, బాలభాస్కర్ (40) కన్నుమూశారు. గత నెల 25న రోడ్డు ప్రమాదానికి గురైన అయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. యాక్సిడెంట్ జరిగిన రోజే అయన కూతురు తేజస్వి(2) మరణించిన సంగతి తెలిసిందే. త్రిస్సూర్‌లో దైవదర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా, తిరువనంతపురం శివారు ప్రాంతం పల్లిప్పురమ్ వద్ద ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాలభాస్కర్ కుమార్తె తేజస్వి (2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా బాలభాస్కర్ తోపాటు అయన భార్య లక్ష్మి శాంతకుమారి (38), డ్రైవర్ అర్జున్ లు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ఆరోగ్యం మరింత విషమించి నేడు(మంగళవారం) మృతిచెందారు. ప్రస్తుతం అయన భార్య, డ్రైవర్ అర్జున్ ఇంకా చికిత్స పొందుతున్నారు. మరోవైపు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా సంగీత దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన బాలభాస్కర్ స్టేజీ షోలతో గాయకుడిగా, వయోలినిస్ట్‌గా మరింత పాపులర్ అయ్యారు. 12 ఏళ్ళ వయస్సులో తన సంగీత వృత్తిని ప్రారంభించిన మలయాళ చిత్రపరిశ్రమలో అతి చిన్నవయసున్న సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!