ప్రముఖ దర్శకుడి ఆఫీసుకి బాంబు బెదిరింపు
- October 02, 2018
ప్రముఖ సిని దర్శకుడు మణిరత్నం అఫిస్ను పేల్చేస్తామని ఓ ఆగతంకుడు ఫోన్ చేసిన ఘటన కోలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం రేపింది. తాజాగా అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు,జ్యోతిక,ప్రకాశ్ రాజ్ లాంటి ప్రధాన తారగాణంతో తెరకెక్కిన తమిళ చిత్రం చెక్క చివంత వానం. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా నవాబ్ టైటిల్‌తో విడుదల అయింది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే తమిళ నాట 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని అభ్యంతరకర డైలాగులు ఉన్నాయి వాటిని తొలగించాలని ఓ ఆగంతకుడు మణిరత్నం అఫిస్కు ఫోన్ చేశాడు. డైలాగులని తొలగించకపోతే ఆఫీసుని పేల్చేస్తామని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అఫిస్ సిబ్బంది షోలీసులకు సమాచారం అందించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ ఎవరు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నారు
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి