కోల్కతాలో బాంబు పేలుడు
- October 02, 2018
కల్కత్తా లో ఈ ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధి కాజిపార ప్రాంతంలోని ఓ పండ్ల దుకాణంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. మొదటగా గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చని భావించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు అది సిలిండర్ పేలుడు కాదని తేల్చారు. ఫోరెన్సిక్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బ్లాస్టింగ్ జరిగిన చోట విచారణ జరుపుతున్నారు.
డమ్ డమ్ మున్సిపాలిటి ఛైర్మన్ పంచూ రాయ్ బిల్డింగ్ లోనే ఈ పేలుడు చోటు చేసుకుంది. దీంతో ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. తనను అంతం చేసేందుకే ప్రత్యర్ధులు బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు పంచూ రాయ్ ఆరోపిస్తున్నారు. ఇది పక్కా ప్లాన్ తో చేసిన దాడి అంటున్నారాయన. టీఎంసీ నేతలను టార్గెట్ చేసుకొని ప్రత్యర్ధి పార్టీలు దాడులకు తెగబడుతున్నాయంటూ పరోక్షంగా RSSపై ఆరోపణలు చేశారాయన.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







