శ్రీకాకుళంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్.!

- October 02, 2018 , by Maagulf
శ్రీకాకుళంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్.!

శ్రీకాకుళంలో ఎన్టీఆర్ అనగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అక్కడ ఉన్నారు అనుకుంటే పొరపాటే. విషయం ఏంటంటే… నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న సినిమా ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ శ్రీకాకుళంలో చేయనున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు షూటింగ్ చేసారు. ఫస్ట్ షెడ్యూల్‌లో బసవతారకం పాత్ర పోషిస్తోన్న బాలీవుడ్ భామ విద్యాబాలన్ పైన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్‌లో చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తోన్న దగ్గుబాటి రానా, బాలయ్యపై కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఇక మూడవ షెడ్యూల్‌లో అక్కినేని పాత్ర పోషిస్తోన్న సుమంత్, బాలయ్యపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇక తాజా షెడ్యూల్‌ను అక్టోబర్ 4 నుంచి శ్రీకాకుళంలో ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఎన్టీఆర్ ప్రచారం శ్రీకాకుళం నుంచి ప్రచార రథంలో ప్రారంభించారు. అందుచేత శ్రీకాకుళంలోనే షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ జాయిన్ అవుతారు. ఆయన ఇందులో తండ్రి హరికృష్ణ పాత్ర పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో దాదాపు సగం షూటింగ్ పూర్తయినట్టే. స్వరవాణి కీరవాణి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జనవరి 9న అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ ఎన్టీఆర్ మూవీని రిలీజ్ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com