అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి

- October 02, 2018 , by Maagulf
అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి

అబుదాబీలో సంభవించిన ఓ అగ్ని ప్రమాదం 8 మందిని బలి తీసుకుంది. అబుదాబీలోని బని యాస్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో చెలరేగిన అగ్ని ప్రమాదం, ఆ ఇంట్లోని 8 మంది ప్రాణాల్ని చిదిమేసింది. రెండు అంతస్తుల గల విల్లాలో అగ్ని ప్రమాదం జరగ్గా, కింది అంతస్తు నుంచి పై అంతస్తుకి మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో వున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com