యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌ కోసం బహ్రెయిన్‌ తరఫున నలుగురు అథ్లెట్స్‌

- October 02, 2018 , by Maagulf
యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌ కోసం బహ్రెయిన్‌ తరఫున నలుగురు అథ్లెట్స్‌

2018 సమ్మర్‌ యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌ కోసం బహ్రెయిన్‌ నలుగురు అథ్లెట్స్‌ని పంపనుంది. అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఈ పోటీలు జరుగుతాయి. యూనిస్‌ అహ్మద్‌ అనాన్‌, మర్వా ఇబ్రహీమ్‌ అల్‌ అజూజ్‌, మర్యామ్‌ మొహమ్మద్‌, అల్‌ నబీల్‌ దావాని బహ్రెయిన్‌ తరఫున మూడు విభాగాల్లో పోటీ పడతారు. అథ్లెటిక్స్‌, టెన్నిస్‌ మరియు వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగాల్లో ఈ నలుగురూ టైటిల్‌ కోసం పోటీ పడనున్నారు. అథ్లెటిక్స్‌లో అనన్‌, మర్వా పోటీ పడ్తారు. అనన్‌ మెన్స్‌ 400 మీటర్స్‌ విభాగంలో, మార్వా విమెన్స్‌ 100 మీటర్స్‌ విభాగంలోనూ పోటీ పడబోతున్నారు. మొత్తంగా ఈ పోటీల్లో 4,000 మంది అథ్లెట్స్‌ టైటిల్‌ కోసం పోటీ పడతారు. 206 దేశాల నుంచి ఆటగాళ్ళు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా వెలుపల జరుగుతున్న తొలి సమ్మర్‌ యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌గా వీటికి మరో ప్రత్యేకత వుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com