నవంబర్‌ 9న దుబాయ్‌ విమెన్స్‌ ట్రయథ్లాన్‌

- October 02, 2018 , by Maagulf

దుబాయ్: గత ఏడాది నవంబర్‌లో జరిగిన తొలి ఎడిషన్‌ దుబాయ్‌ విమెన్స్‌ ట్రయథ్లాన్‌ ఘనవిజయం సాధించడంతో, సెకెండ్‌ ఎడిషన్‌ని ఇంకా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్‌ 9న సెకెండ్‌ ఎడిషన్‌ దుబాయ్‌ విమెన్స్‌ ట్రయథ్లాన్‌ని నిర్వహించబోతున్నారు. యూఏఈ నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ ప్రెసిడెంట్‌, మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ నాలెడ్జ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌మక్తౌమ్‌ నేతృత్వంలో ఈ ఈవెంట్‌ జరుగుతుంది. 16 ఏళ్ళ పైబడిన మహిళలు ఈ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అర్హులు. సూపర్‌ స్ప్రింట్‌, స్ప్రింట్‌, ఒలింపిక్‌ డిస్టెన్స్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. రెండో ఎడిషన్‌ విమెన్స్‌ ట్రయథ్లాన్‌ నిర్వహిస్తుండడం చాలా ఆనందంగా వుందని ఈవెంట్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ హెడ్‌ లామియా అబ్దుల్‌అజీజ్‌ఖాన్‌ చెప్పారు. దుబాయ్‌ లేడీస్‌ క్లబ్‌లో ఈ ఈవెంట్‌ జరుగుతుంది. 400 మీటర్స్‌ స్విమ్మింగ్‌, 10 కిలోమీటర్ల సైక్లింగ్‌, 2.5 కిలోమీటర్ల రన్‌ సూపర్‌ స్ప్రింట్‌లో భాగం. స్ప్రింట్‌లో 750 మీటర్ల స్విమ్మింగ్‌, 20 కిలోమీటర్ల సైక్లింగ్‌, 5 కిలోమీటర్ల రన్‌ వుంటుంది. ఒలింపిక్‌ డిస్టెన్స్‌లో 1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్‌, 40 కిలోమీటర్ల సైక్లింగ్‌, 10 కిలోమీటర్ల రన్‌ వుంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com