సిరియాలో కొత్త క్షిపణులను దించిన రష్యా...అమెరికా హెచ్చరిక
- October 03, 2018
EPA ఎస్-300 క్షిపణుల చేరికతో సిరియా ఆర్మీ సామర్థ్యం మరింత పెరుగుతుందని రష్యా అంటోంది. వైమానిక దాడులను ఎదుర్కొనే మరికొన్ని క్షిపణులను సిరియాకు తరలించామని రష్యా తెలిపింది. సిరియాలో తన నిఘా విమానం కుప్పకూలిన తర్వాత రెండు వారాలకు రష్యా ఈ చర్యలు చేపట్టింది. సోమవారం నాడు నాలుగు ఎస్-300 క్షిపణి లాంచర్లు సిరియా చేరుకున్నాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు.
రెండు వారాల క్రితం సిరియాలోని లతాకియా ప్రావిన్సులో ఇజ్రాయేల్ వైమానిక దాడులు చేస్తున్న సమయంలో సిరియా బలగాలు జరిపిన ఎదురు దాడిలో ప్రమాదవశాత్తు రష్యాకు చెందిన Il-20 నిఘా విమానం కూలింది. ఆ ఘటనలో 15 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడి ఇజ్రాయేల్ పనేనని రష్యా ఆరోపించగా, ఇజ్రాయేల్ తోసిపుచ్చింది.
ఆ క్షిపణులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని రష్యాను అమెరికా హెచ్చరించింది. 1987 నాటి ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (ఐఎన్ఎఫ్) ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోందని నాటో రక్షణ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు బ్రసెల్స్ వెళ్లిన అమెరికా రాయబారి కాయ్ బెయిలీ హచిసన్ అన్నారు. ఆ ఒప్పందం ప్రకారం భూతలం నుంచి ప్రయోగించే మధ్యస్థ శ్రేణి క్షిపణులపై ( 500 నుంచి 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు) నిషేధం ఉంది. ఈ పరిణామాలు అమెరికా, రష్యాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు దారితీసేలా కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







