'చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్' గా నిలిచిన మోడీ
- October 03, 2018
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును అందుకున్నారు. పర్యావరణ సమతుల్యం కోసం కృషి చేసిన మోదీకి.. ఐక్యరాజ్యసమితి ఈ అవార్డును ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటరెస్ చేతుల మీదుగా ఈ అవార్డును మోదీ అందుకున్నారు. చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును స్వీకరించడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఈ పురస్కారం భారతీయులకు గౌరవాన్నిచ్చిందన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు భారతీయులు కట్టుబడి ఉన్నారన్నారు. పర్యావరణం, విపత్తు.. రెండింటికీ సంస్కృతితో సంబంధం ఉన్నాయని, పర్యావరణం గురించి మన సంస్కృతి ఆలోచించకుంటే, విపత్తులను నివారించలేమని మోదీ అన్నారు. సబ్ కా సాత్ నినాదంలోనే, ప్రకృతి పరిరక్షణ కూడా ఉందని ప్రధాని తెలిపారు.
ప్రధాని మోదీతో పాటు మరో ఆరుగురికి చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును ఇటీవల యూఎన్ ప్రకటించింది. ఫ్రాన్స్‌తో అంతర్జాతీయ సౌర ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మోదీని ఈ అవార్డు వరించింది. పర్యావరణ పరిరక్షణ కోసం మోదీ నడుం బిగించారని యూఎన్ ప్రధాన కార్యదర్శి గుటరెస్ తెలిపారు. పర్యావరణ రక్షణ కోసం ప్రపంచ దేశాలు భారత్‌ను ప్రేరణగా తీసుకోవాలని ఆంటోనియో తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







