"బిగ్ బాస్-3" వ్యాఖ్యాత ఎవరనే దానిపై ఉత్కంఠ

- October 03, 2018 , by Maagulf

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోగా ఆవిష్కృతమైన 'బిగ్ బాస్' షోకు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించినంత కాలం ఈ రియాలిటీ షోకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇక 'బిగ్ బాస్' షో పూర్తయిపోగానే తరువాత సీజన్ కు వ్యాఖ్యాత ఎవరనేదానిపై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. నాని, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల పేర్లు విన్పించాయి. చివరగా నాని ఈ షోకు వ్యాఖ్యాత అంటూ 'బిగ్ బాస్-2' నిర్వాహకులు ప్రకటించారు. బిగ్ బాస్2 వివాదాలతో నడిచింది. సీజన్ 2 ని హోస్ట్ చేసిన నాని ఇదే తన చివరి సీజన్ అని ప్రకటించేశారు.

దీంతో బిగ్ బాస్-3 కి హోస్ట్ గా ఎవరు చేయబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఇప్పట్నుంచే మొదలైంది. దీనిపై సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుపుతున్నారు. అందులో ప్రధానంగా ముగ్గురు పేర్లు విన్పిస్తున్నాయి. యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నిజానికి తన టాలెంట్ తో బుల్లితెర ఆడియన్స్ ని కూడా కట్టిపడేసే సత్తా అల్లు అర్జున్ కు ఉందని, అల్లు అర్జున్ హోస్ట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రానాకి ఇదివరకే టీవీ షోలు చేసిన అనుభవం ఉండడంతో బిగ్ బాస్ షోకి పూర్తి న్యాయం చేయగలడని అభిమానులు ఆలోచిస్తుండగా… విజయ్ దేవరకొండ బిగ్ బాస్ సీజన్ 2 లో కనిపించి స్టేజ్ ని షేక్ చేశాడు. అదే అతడు హోస్ట్ గా వస్తే టీఆర్పీ రేటింగ్స్ పై ప్రభావం బాగా ఉంటుందని యాజమాన్యం ఆలోచిస్తుందట. మరి ఈ ముగ్గురిలో ఎవరిని వ్యాఖ్యాతగా నిర్ణయిస్తారో వేచి చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com