యూఏఈ ఆమ్నెస్టీ: తెలంగాణ కార్మికులకు టిక్కెట్లు అందించిన తెరాస NRI కో-అర్డినేటర్

- October 03, 2018 , by Maagulf

యూ.ఏ.ఈ:జీవ‌నోపాధి కోసం యూఏఈ వెళ్లి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల అక్క‌డే చిక్కుకుపోయిన తెలంగాణ బిడ్డ‌లను ఆ దేశం క‌ల్పించిన‌ ఆమ్నెస్టీ అవ‌కాశంతో అక్కడ ఉన్న తెలంగాణ కార్మికుల  బాధలు తెలుసుకొని వారికి విమాన టిక్కెట్లు సమకూర్చి ప్రభుత్వ పరంగా మంత్రి కేటీఆర్ స్వ‌దేశానికి రప్పించిన తీరు మరియు చొరవకు అలాగే  ముఖ్యమంత్రి కేసిర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా సహాయసహకారాలను అందించి దీనిని ముందుకు నడిపించి, ఇక్కడ ఉన్న సమస్యలను స్యయంగా చూసి, అవగాహన చేసుకుని మరియు  అన్ని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వనికి  వివరించిన  తెరాస NRI కో-అర్డినేటర్ మహేష్ బిగాల కి కూడా TRS NRI Cell Dubai UAE తరపున ధన్యవాదాలు తెలపటం జరిగింది.విమానాశ్రయం వద్ద ఈ టిక్కెట్ల పంపిణి కార్యక్రమంలో అరవింద్ సింగ్,చిట్టిబాబు,కోటపాటి నర్సింహా నాయుడు,నరేష్ ,రవి ఉట్నూరి,రమేష్ ఏముల,గుండల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com