వృద్ధులకు షార్జా పబ్లిక్ బస్‌లలో ఉచిత ప్రయాణ సౌకర్యం
- October 03, 2018
షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, పబ్లిక్ బస్సుల్లో వృద్ధులకు ఎలాంటి రుసుము తీసకోకుండా కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌కి ట్యాక్సీల్లో తక్కువ ఫేర్‌తో అవకాశం కల్పించేలా కూడా నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రొక్యూర్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ హెడ్ యూసుఫ్ సులైమాన్ అల్ హమ్మాది మాట్లాడుతూ, వృద్ధుల పట్ల ఎమిరేట్‌కి వున్న గొప్ప ఆలోచనను ఈ నిర్ణయం బయటపెట్టిందని చెప్పారు. ఇయర్ ఆఫ్ జాయెద్‌లో భాగంగా, ఈ గొప్ప కార్యక్రమం చేపట్టడం పట్ల ఆనందంగా వుందని ఆయన వివరించారు. లబ్ది దారులకోసం ప్రత్యేక పర్మిట్లను త్వరలో జారీ చేయబోతున్నారు. అప్పటిదాకా తమ ఐడీ కార్డుల్ని టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగించుకోవచ్చు. 62 ఏళ్ళ ఈజిప్టియన్ హస్సన్ అబ్దుల్లా, వృద్ధుల పట్ల ఆర్‌టిఎ చూపుతున్న చొరవను అభినందిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి