ఒమన్‌లో బ్యాంక్‌ని సీజ్‌ చేసిన మునిసిపల్‌ అథారిటీస్‌

- October 03, 2018 , by Maagulf
ఒమన్‌లో బ్యాంక్‌ని సీజ్‌ చేసిన మునిసిపల్‌ అథారిటీస్‌

మస్కట్‌: అల్‌ కువైర్‌లోని ఓ బ్యాంకుని మస్కట్‌ మునిసిపల్‌ అథారిటీస్‌ సీజ్‌ చేయడం జరిగింది. రోజువారీ కార్యకలాపాలతోపాటుగా, పబ్లిక్‌ వేర్‌హౌస్‌గా కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నందుకుగాను బ్యాంకును సీజ్‌ చేసినట్లు మస్కట్‌ మునిసిపాలిటీ పేర్కొంది. బౌషర్‌లోని మస్కట్‌ మునిసిపాలిటీ అర్బన్‌ ఇన్‌స్పెక్షన్‌ యూనిట్‌, ఈ సీజ్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్థానిక బ్యాంకు లైసెన్స్‌ లేకుండా వేర్‌హౌస్‌ యాక్టివిటీస్‌ నిర్వహిస్తుండడంతో సీజ్‌ చేయడం జరిగిందని, మునిసిపల్‌ చట్టాల ఉల్లంఘన ఇక్కడ స్పష్టంగా కనిపించిందని మస్కట్‌ మునిసిపాలిటీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com