బహ్రెయిన్‌లో మహాత్ముడికి ఘన నివాళి

- October 03, 2018 , by Maagulf
బహ్రెయిన్‌లో మహాత్ముడికి ఘన నివాళి

బహ్రెయిన్: మహాత్మాగాంధీ జీవితం, ఈ తరానికీ వచ్చే తరాలకీ ఆదర్శనమని భారత రాయబారి అలోక్‌ కుమార్‌ సిన్హా చెప్పారు. బహ్రెయిన్‌లోని ఇండియన్‌ ఎంబసీ కార్యాలయంలో మహాత్మాగాంధీ 150వ జయస్త్రంతి వేడుకలు జరిగాయి. స్వచ్ఛత పట్ల మహాత్మాగాంధీ ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపేవారనీ, ఆ బాటలో మనమంతా నడవాల్సి వుందనీ, హింసకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీ, అహింసా మార్గంలో అద్భుతాలు సాధించారని అలోక్‌ సిన్హా చెప్పారు. అహింస మార్గంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న మహాత్ముడ్ని ప్రతి భారతీయుడూ గుర్తుంచుకుంటారనీ, ఆయన మార్గం అనుసరనీయమని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com