ఇది మామూలు సాహసం కాదు బాబోయ్..!

- October 03, 2018 , by Maagulf
ఇది మామూలు సాహసం కాదు బాబోయ్..!

‘సాహసం చేయరా డింభకా’ అన్న పదం జపాన్ వాళ్లకు కరెక్ట్ గా సూట్ అవుతుందేమో ఈ వీడియో చూస్తే..
రెండు కొండలమధ్య అదికూడా అరకిలోమీటరు ఎత్తులో తాడు మీద సైకిల్ తొక్కడం అంటే మామూలు విషయం కాదు. దానికోసం ఎన్ని గట్స్ కావాలి. అంతేకాకుండా తాడుపై ముందుకు చూస్తూ సైకిల్ తొక్కడమే కష్టమనుకుంటే.. అదే తాడుపై సైకిల్ ను వెనక్కి తొక్కడం ఇంకెంత కష్టమో.. ఇటీవల జపాన్ కు చెందిన సాహసవీరులు కొందరు ఈ ఊహకందని ఫీట్లు చేశారు. సాధారణంగా ఈ తరహా ఫీట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తూనే ఉంటాయి కానీ ఇలా అబ్బురపరిచే దృశ్యాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. ఇందులో ఇద్దరు పాల్గొంటారు. వారిలో ఒకరు తాడుపై సైకిల్ తొక్కుతూ ఉంటే మరొకరు అదే సైకిల్ ను బలమైన ఇనుప తీగతో కట్టేసి దానికి వేలాడుతాడు. తద్వారా పైన ఉన్న వ్యక్తి బ్యాలెన్స్ తప్పకుండా వేలాడే వ్యక్తిని నిలువరిస్తాడు. అంతేకాకుండా సైకిల్ ను వెనక్కి సైతం పోనిస్తాడు. ఒంటి కాలిపై నిలబడతారు. ఇదిలావుంటే ఈ స్టైల్ లో సైకిల్ తొక్కడమే విశేషమనుకుంటే తాడుపై బైక్ ను పోనించడం మరో అద్భుతం. అది కూడా వేగంగా బైక్ ను నడపడం బహుశా ఇటువంటి సాహసవీరులకు మాత్రమే సాధ్యమవుతుందేమో. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో షేర్ అయిన ఈ వీడియో.. ప్రస్తుతం లక్షల వ్యూస్ తో వైరల్ గా మారాయి. ఒకసారి వారి సాహసాలు మీరు కూడా చూడండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com