కేరళకు పొంచి ఉన్న మరో ప్రమాదం.. రెడ్ అలర్ట్
- October 04, 2018
కళ్ల ముందు కేరళ వరద దృశ్యాలు కదలాడుతూనే ఉన్నాయి. దేవుడికి ఇష్టమైన ప్రదేశంగా చెప్పుకునే కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అంతటి భారీ విపత్తునుంచి ఇంకా కోలుకోనే లేదు. గత వంద సంవత్సరాల్లో ఇలాంటి భీభత్సాన్ని ఎన్నడూ చూడని కేరళ వాసులు ఆ భయంకర రోజుల్ని తలుచుకుంటూ మళ్లీ మామూలు జీవనం సాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రానున్న శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ముఖ్యంగా ఇడుక్కి, పలక్కాడ్, త్రిసూర్ జిల్లాలకు అక్టోబర్ 7న రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రబావం హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో బుధవారం సాయింత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరారు.
తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని జాలర్లను హెచ్చరించారు. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ రాష్ట్రం మళ్లీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..