టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు..
- October 04, 2018
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సుమారు వెయ్యి కొత్త ఉద్యోగ నియామకాల్ని చేపట్టనుంది. ఇందుకు నేషనల్ క్వాలిఫయిర్ టెస్ట్ (ఎన్‌క్యూటీ) ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేయనున్నారు. ఏడాదికి రూ.6.5 లక్షల ప్యాకేజీతో డిజిటల్ నైపుణ్యం కలిగిన ఇంజనీర్లను సంస్థ నియమించనున్నట్లు టీసీఎస్ గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ అజయ్ ముఖర్జీ తెలిపారు. ఇతర ఇంజనీరింగ్ ఉద్యోగాల ప్రారంభ జీతం ఏడాదికి రూ.3.5 లక్షలు ఉండగా టీసీఎస్ దాదాపు రెట్టింపు జీతంతో బంపర్ ఆఫర్ ఇస్తోందని చెప్పారు.
ఆన్‌లైన్లో నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని డిజిటల్ పూల్ టెస్ట్‌కు ఆహ్వానిస్తారు. ఈ పరీక్ష కూడా పాసైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేసిన వారిని ఉద్యోగులుగా టీసీఎస్ సంస్థ నియమిస్తుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







