నిరుద్యోగ భృతికి ఇలా అప్లై చేసుకోండి..

- October 04, 2018 , by Maagulf
నిరుద్యోగ భృతికి ఇలా అప్లై చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిరుద్యోగ భృతిని ప్రారంభించింది. నిరుద్యోగ యువతకు ఆసరాగా నెలనెలా రూ.1000 లను నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తుంది. ఇప్పటికే ఏపీలోని నిరుద్యోగ యువత ఈ పథకంతో లబ్ది పొందుతున్నారు. అయితే చాలామంది ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఆన్ లైన్ ద్వారా నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవచ్చు.. దానికి ఇలా చేయాల్సివుంది..

ముందుగా అధికారిక వెబ్సైటు ; http://yuvanestham.ap.gov.in/CMyuvaNapp/register.html ను బ్రౌజర్ లో ఓపెన్ చెయ్యాలి.

* తరువాత send otp బటన్ క్లిక్ చెయ్యాలి. అప్పుడు మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసి verify OTP ని క్లిక్ చెయ్యాలి.

* దాంతో ప్రజా సాధికార సర్వేలో నమోదు చేసిన మీ వివరాలు వస్తాయి. మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి.

* ఆ తరువాత apply/continue బటన్ క్లిక్ చెయ్యాలి.

* మీకు సంబంధించిన వివరాలతోపాటు ఈ పధకానికి అవసరమైన డాక్యూమెంట్లు(ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు) అడుగుతుంది. అక్కడ కనిపించే వివరాల్లో ఒకవేళ రైట్ మార్క్ కాకుండా క్రాస్ మార్కు ఉన్నట్లయితే పక్కనే హెల్ప్ అనే ఆప్షన్ లో మీరు ఏమి చెయ్యాలనే విషయం ఉంటుంది. దాని ఆధారంగా క్రాస్ మార్కు ఉన్న ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకోవచ్చు.

*ఇవన్నీ పూర్తయిన తరువాత రిజిస్టర్ బటన్ ను క్లిక్ చెయ్యాలి. దాంతో మీ అప్లికేషన్ సంబంధింత అధికారులకు వెళుతుంది. వారు అన్ని చెక్ చేసుకున్న తరువాత మీరు ఎలిజిబులిటీ కాదో మీ మొబైల్ నెంబర్ కు సందేశం పంపిస్తారు. ఒకవేళ ఎలిజిబుల్ కాకుంటే ఎందుకు అవ్వలేదో కారణం కూడా తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com