బంగారం ధర భారీగా తగ్గింది...
- October 05, 2018
మగువల మనసు దోచే బంగారం గత రెండు రోజులుగా పెరిగి వారిని నిరాశ పరిచాయి. అయితే నేడు భారీగా తగ్గి ఊరిస్తోంది. బంగారు ఆభరణాలంటే మక్కువ చూపే వారు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకునే నిమిత్తం బంగారం దుకాణాలకు క్యూకడుతున్నారు. నేటి ట్రేడింగ్లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.250 తగ్గి రూ.31,850కు చేరుకుంది.
వెండి కూడా కిలోకి రూ.100లు తగ్గి రూ.39,250కి చేరుకుంది.
అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు మరియు వ్యాపారస్తుల నుంచి వచ్చే ఆర్డర్స్ తగ్గడమే బంగారం ధర పతనానికి కారణమైందని ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. న్యూఢిల్లీలో స్వచ్ఛమైన పసిడి ధర రూ.250 తగ్గి రూ.31,850కి చేరుకోగా 99.5 నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.31,700గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.16 శాతం తగ్గి జౌన్సు 1,199.40 డాలర్లు పలికింది. ఇక వెండి కూడా 0.03 శాతం తగ్గి ఔన్స్ 14.64 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!