తెలంగాణ:మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ ప్రెస్‌మీట్..
- October 05, 2018
తెలంగాణలో ముందస్తు ఎన్నికల షెడ్యూల్‌పై ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ ప్రెస్‌మీట్ ఉండడంతో అందరి దృష్టీ ఢిల్లీపై పడింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదల చేస్తారని దాదాపు స్పష్టమైంది. అయితే.. వాటితో పాటుగా తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తారా? ఇప్పుడిదే అందరిలో ఉత్కంఠ రాజేస్తోంది.
ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే.. తెలంగాణకు కలిపి ఎన్నికలు నిర్వహించవచ్చని కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. కేంద్రంతో, ఈసీతో మాట్లాడుకునే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఓటర్ల జాబితాపై పిటిషన్లు హైకోర్టులో విచారణలో ఉండగా.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటిస్తుందా? దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘం విమర్శల పాలవుతోంది. నిజానికి మధ్యాహ్నం 12న్నర గంటలకు సీఈసీ ప్రెస్‌మీట్ జరగాల్సి ఉండగా.. మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసుకున్నారు. దీని వెనుక కేంద్రం ఒత్తిడి ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజస్తాన్‌లో మోడీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఒంటి గంటకు సభ ఉంది. ఈలోపు షెడ్యూల్ ప్రకటిస్తే.. మోడీ సభకు ఎన్నికల కోడ్ పరిమితులు ఏర్పడతాయి. అందుకనే.. మోడీ సభ ముగిశాక.. 3 గంటలకు షెడ్యూల్ ప్రకటించబోతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







