డిసెంబర్‌ 7న తెలంగాణలో పోలింగ్‌

- October 06, 2018 , by Maagulf
డిసెంబర్‌ 7న తెలంగాణలో పోలింగ్‌

తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి సీఈసీ షెడ్యూల్ విడుదల చేశారు. నవంబర్ 12న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రాజస్థాన్ తో పాటు… డిసెంబర్ 7న ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయన్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 11న వెలువడుతాయి.

*తెలంగాణ ఎన్నికలకు నవంబర్‌ 12 న నోటిఫికేషన్‌
*నామినేషన్ల ఉపసంహరణ నవంబర్‌ 22
*నామినేషన్ల పరిశీలన నవంబర్‌ 20
*తెలంగాణలో నామినేషన్లకు తుది గడువు నవంబర్‌ 19
*డిసెంబర్‌ 7 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
*డిసెంబర్‌ 11 న తెలంగాణలో ఎన్నికల ఫలితాలు
*రాజస్థాన్‌తో పాటే తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం
*ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించనున్న ఈసీ
*నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్‌ 29
*నామినేషన్ల పరిశీలన అక్టోబర్‌ 27
*చత్తీస్‌గఢ్‌లో రెండో విడత ఎన్నికల నామినేషన్ల తుది గడువు అక్టోబర్‌ 26
*నవంబర్‌ 12 చత్తీస్‌గఢ్‌లో తొలివిడత పోలింగ్‌
*నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 26
*నామినేషన్ల పరిశీలన అక్టోబర్‌ 24
*మొదటి విడత ఎన్నికల నామినేషన్లకు తుది గడువు అక్టోబర్‌ 23
*ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతలుగా పోలింగ్‌
*ఈవీఎంలు, వీవీపాట్‌ యంత్రాలను సరిపడా సిద్ధం చేశాం
*ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి
*డిసెంబర్‌ 15 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం
*నాలుగు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌
*అక్టోబర్‌ 12 న తెలంగాణ ఓటర్ల తుదిజాబితా ప్రకటన
*రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాలకు షెడ్యూల్‌ ప్రకటన
*నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటన
*తుది జాబితా వెలువడిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తాం
*షెడ్యూల్‌ ప్రకారం కూడా తెలంగాణలో సోమవారం జాబితా వెలువడాల్సింది
*తెలంగాణ హైకోర్టులో ఓటరు జాబితాపై కేసు పెండింగ్‌లో ఉంది

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com