ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్: 550 మంది క్రిమినల్స్‌ని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీస్
- October 06, 2018
దుబాయ్:ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందిన స్మార్ట్ సిస్టమ్, 550 మంది క్రిమినల్స్‌ని అరెస్ట్ చేయడంలో దుబాయ్ పోలీస్‌కి సహకరించింది. 2018 సంవత్సరానికి సంబంధించిన ఈ గణాంకాల్ని వెల్లడించడం జరిగింది. వీరిలో 109 మస్త్రంది వాంటెడ్ క్రిమినల్స్ కాగా, పలు కేసుల్లో 441 మంది సస్పెక్ట్స్గా వున్నారు. స్మార్ట్ ఏరియా సిస్టమ్ కారణంగా డిస్టర్బింగ్ క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గింది. ఈ సిస్టమ్ ఫేస్ రికగ్నింగ్ కెమెరాల ద్వారా పనిచేస్తుంది. దుబాయ్ పోలీస్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలైల్ ఇబ్రహీమమ్ అల్ మన్సౌరి మాట్లాడుతూ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్మార్ట్ టూల్స్‌ని వినియోగించి ఈ ప్రాజెక్ట్‌ని రూపకల్పన చేయడం ద్వారా క్రైమ్ రేట్‌ని తగ్గించగలిగినట్లు చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరియు కెమెరాల ద్వారా సేఫ్ సిటీ స్ట్రేజీని అమల్లోకి తెచ్చేందుకు పోలీస్ ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







