ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌: 550 మంది క్రిమినల్స్‌ని అరెస్ట్‌ చేసిన దుబాయ్‌ పోలీస్‌

- October 06, 2018 , by Maagulf
ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌: 550 మంది క్రిమినల్స్‌ని అరెస్ట్‌ చేసిన దుబాయ్‌ పోలీస్‌

దుబాయ్:ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా రూపొందిన స్మార్ట్‌ సిస్టమ్‌, 550 మంది క్రిమినల్స్‌ని అరెస్ట్‌ చేయడంలో దుబాయ్‌ పోలీస్‌కి సహకరించింది. 2018 సంవత్సరానికి సంబంధించిన ఈ గణాంకాల్ని వెల్లడించడం జరిగింది. వీరిలో 109 మస్త్రంది వాంటెడ్‌ క్రిమినల్స్‌ కాగా, పలు కేసుల్లో 441 మంది సస్పెక్ట్స్‌గా వున్నారు. స్మార్ట్‌ ఏరియా సిస్టమ్‌ కారణంగా డిస్టర్బింగ్‌ క్రైమ్‌ రేట్‌ గణనీయంగా తగ్గింది. ఈ సిస్టమ్‌ ఫేస్‌ రికగ్నింగ్‌ కెమెరాల ద్వారా పనిచేస్తుంది. దుబాయ్‌ పోలీస్‌ - క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ ఖలైల్‌ ఇబ్రహీమమ్‌ అల్‌ మన్సౌరి మాట్లాడుతూ, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ స్మార్ట్‌ టూల్స్‌ని వినియోగించి ఈ ప్రాజెక్ట్‌ని రూపకల్పన చేయడం ద్వారా క్రైమ్‌ రేట్‌ని తగ్గించగలిగినట్లు చెప్పారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ మరియు కెమెరాల ద్వారా సేఫ్‌ సిటీ స్ట్రేజీని అమల్లోకి తెచ్చేందుకు పోలీస్‌ ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com