అక్టోబర్‌ 7న దుబాయ్‌ గార్డెన్‌ ప్రారంభం

- October 06, 2018 , by Maagulf
అక్టోబర్‌ 7న దుబాయ్‌ గార్డెన్‌ ప్రారంభం

దుబాయ్:ప్రపంచంలోనే అతి పెద్ద యూనిక్‌ థీమ్‌ పార్క్‌ దుబాయ్‌ గార్డెన్‌ గ్లో (డిజిజి) ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమయ్యింది. ఆదివారం ఫోర్త్‌ సీజన్‌ ప్రారంభోత్సవం జరుగుతుంది. 2018 ఎడిషన్‌ థీమ్‌గా 'గ్లోవింగ్‌ సఫారీ'ని ఎంపిక చేశారు. గ్లో పార్క్‌తోపాటుగా డైనోసార్స్‌ పార్క్‌, ఐస్‌ పార్క్‌, డిజిజిలో వున్నాయి. ఆర్ట్‌ పార్క్‌, బోస్టింగ్‌ ఆర్ట్‌ వర్క్స్‌ వంటివి రీసైక్లబుల్‌ గ్లాస్‌, పోర్సెలైన్‌, ప్లాస్టిక్‌ బాటిల్స్‌, డిషెస్‌, సీడీలతో రూపొందించారు. లైవ్‌ మ్యూజికల్‌ షోలు, ఇతరత్రా అనేక ప్రదర్శనలు ఈ ఈవెంట్‌లో అదనపు ఆకర్షణలు. ఫుడ్‌ పెవిలియన్‌ ఆహార ప్రియుల్ని అలరించబోతోంది. జబీల్‌లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌కి దగ్గరలో డిజిజిని ఏర్పాటు చేశారు. 65 దిర్హామ్‌లతో ఎంట్రీ పొందినవారికి గ్లో పార్క్‌, డైనోసార్స్‌ పార్క్‌, ఆర్ట్‌ పార్క్‌లలోకి ప్రవేశం లభిస్తుంది. ఐస్‌ పార్క్‌ కోసం 45 దిర్హామ్‌ల అదనపు ఖర్చు తప్పనిసరి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com