షిర్డీసాయి భక్తులకు శుభవార్త...
- October 06, 2018
షిర్డీ : షిర్డీసాయి భక్తులకు శుభవార్త. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 18వతేదీన షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని భక్తుల సందర్శన కోసం 24 గంటలపాటు తెరచి ఉంచాలని శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు నిర్ణయించింది. సాధారణంగా సాయిబాబా ఆలయాన్నితెల్లవారుజామున నాలుగుగంటలకు తెరచి ఆరతి అనంతరం రాత్రి 11 గంటలకు మూసివేస్తారు. కాని షిర్డీసాయి 100వ జయంతోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో 18వతేదీన దేవాలయాన్ని 24 గంటలూ తెరచి ఉంచుతామని శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ప్రకటించింది. సాధారణంగా రోజుకు 50 నుంచి 70వేల మంది భక్తులు షిర్డీ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. దసరా సందర్భంగా ఈ నెల 17 నుంచి 19వతేదీ వరకు ఏడులక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. దసరా సందర్భంగా భక్తులందరికీ దర్శనం కల్పించాలనే లక్ష్యంతో పెయిడ్ వీఐపీ పాసుల జారీని నిలిపివేయాలని ట్రస్టు నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







