‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ ఫస్ట్ లుక్..

- October 06, 2018 , by Maagulf
‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ ఫస్ట్ లుక్..

ప్రస్తుతం బయోపిక్స్ అనేవి భారత చిత్ర పరిశ్రమకు కొత్త ట్రెండ్. సినీ పరిశ్రమలో వస్తున్న బయోపిక్‌లు ప్రేక్షకులకు బాగా “కనెక్ట్” అవుతున్నాయి. మొన్న ‘దంగల్’ ..నిన్న’మహానటి’ ఎంత ఘన విజయం సాధించాయో అందరికి తెలిసిందే. దక్షిణ భారతదేశంలో మహానటి అంటే సావిత్రి, మహాగాయకుడు అంటే ఘంటసాల. ఇప్పుడు అయన జీవితం ఆధారంగానే ‘ ఘంటసాల’ సినిమా వచ్చేస్తుంది.

ఘంటసాల అంటే పాట.. పాట అంటే ఘంటసాల.. పాట కోసం ఎన్ని కష్టాలు పడినా, పట్టిన పట్టు విడవక విజయం సాదించి, ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని నిరూపించారు. వినయంతోనే విద్య ప్రకాశిస్తుంది అనడానికి అయన జీవితమే నిదర్శనం. అయన పాడిన పాటలకు అయన జీవితానికి ఎంత దగ్గర సంబంధం వుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుందన్నారు దర్శక నిర్మాతలు. అయన జీవితం పూల బాట కాదని, ముళ్ళ బాటలో నడిచి, మనకి పూల ‘పాట’లందించాడని చెప్పేదే ఈ చిత్రం అని తెలిపారు.

అన్యుక్తరం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి లక్శ్మీ నీరజ నిర్మాతగా, గాయకుడూ G.V. భాస్కర్ నిర్మాణ సారధ్యం లో ఈ బయోపిక్ తెరకెక్కించనున్నారు. సి. హెచ్ రామారావు ఈ బయోపిక్ కి రచన – దర్శకత్వం వహించారు. బాహుబలి కెమెరామెన్ సెంథిల్ కుమార్ శిష్యుడు వేణు వాదనల ఈ చిత్రానికి కెమెరామెన్.  ఎడిటర్  క్రాంతి (RK). ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వర రావు కుమారుడు సాలూరి వాసూరావు సంగీత దర్శకులుగా పనిచేస్తున్నారు. ఇక మహా గాయకుడు “ఘంటసాల” పాత్రను ‘సూపర్ సింగర్స్ 7’ కృష్ణ చైతన్య పోషిస్తున్నారు. ఘంటసాల సతీమణి ‘సావిత్రి’ పాత్రలో కృష్ణ చైతన్య సతీమణి ప్రముఖ యాంకర్ మృదుల నటిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని శనివారం హైదరాబాద్ లో ప్రముఖ దర్శకులు కె . రాఘవేంద్ర రావు ఆవిష్కరించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ‘టీజర్’ విడుదల చేయనున్నారు. డిసెంబర్‌లో ఈ బయోపిక్‌ని విడుదల చేయటానకి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com