అరేబియా సముద్రంలో వాయుగుండం..అతిభారీ వర్ష సూచన
- October 07, 2018
అరేబియా సముద్రంలో బలపడిన వాయుగుండం పెను తుఫానుగా మారి దక్షిణాది రాష్ట్రాలపై విరుచుకుపడనుందని భారత వాతావరణ విభాగం అధికారులు హెచ్చరించారు. దక్షిణ కర్నాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగిసిపడతాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు దూరంగా వెళ్లొద్దని సూచించింది.
రానున్న 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని, చెన్నై పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
భారత వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విపత్తు నిర్వహణ, కోస్ట్‌గార్డ్స్ బృందాలను అక్కడి ప్రభుత్వాలు సిద్ధం చేశాయి.
అటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రాగల 36 గంటల్లో తుఫానుగా విరుచుకుపడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణం పేర్కొంది.
హైదరాబాద్‌కు వర్ష సూచన
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 48గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి