మైనర్‌ ఆర్గాన్‌ డోనర్స్‌: నిబంధనలు జారీ చేసిన మినిస్ట్రీ

- October 07, 2018 , by Maagulf
మైనర్‌ ఆర్గాన్‌ డోనర్స్‌: నిబంధనలు జారీ చేసిన మినిస్ట్రీ

మస్కట్‌: ఒమన్‌లో మైనర్స్‌ కూడా ఇకపై ఆర్గాన్స్‌ని డొనేట్‌ చేయవచు&ఉచ. అయితే, వీటి కోసం కొన్ని నిబంధనల్ని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన డిక్రీ ప్రకారం.. 18 ఏళ్ళ లోపు వయసున్న డోనర్‌ అయితే, లీగల్‌ గార్డియన్‌ నుంచి రాత పూర్వకమైన అగ్రిమెంట్‌తోపాటు, అవయవాన్ని తీసుకోదల్చిన వ్యక్తి, ఇచ్చే వ్యక్తికి సెకెండ్‌ రిలేటివ్‌ అయి వుండాలి. పేషెంట్‌కి ఇతరత్రా ట్రీట్‌మెంట్‌ అవకాశాలు వుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయకూడదు. ఈ ప్రక్రియ ద్వారా డోనర్‌కి ఎలాంటి ప్రాణ హానీ కలగనివ్వకూడదు. 18 ఏళ్ళు దాటినవారికి మాత్రం 4వ డిగ్రీ రిలేటివ్‌ అయితే ఆర్గాన్‌ని డొనేట్‌ చేయవచ్చు. మానెటరీ, ఎమోషనల్‌, ఫిజికల్‌ ప్రెజర్‌ లేకుండా తన ఇష్టపూర్వకంగానే డోనర్‌, ఆర్గాన్‌ డొనేట్‌ చేయడానికి అవకాశం వుంటుంది. ఇందుకోసం రాతపూర్వకమైన వివరణ అవసరం. ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గాన్స్‌కి సంబంధించి లైసెన్స్‌ పొందడం, మెడికల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో ఇంటర్నల్‌ కమిటీ వుండడం.. లాంటివి ఆర్గాన్‌ డొనేషన్‌లో కీలకమైన నిబంధనలు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com