వారం రోజులపాటు కేవలం ఆన్‌లైన్‌లోనే గవర్నమెంట్ సర్వీసులు
- October 07, 2018
దుబాయ్: 1000కి పైగా గవర్నమెంట్ సర్వీసులు వారం రోజులపాటు కేవలం ఆన్‌లైన్‌లోనే అభ్యమవుతాయి. అక్టోబర్ 21 నుంచి 25 వరకు ఈ విధానం అందుబాటులో వుంటుంది. గవర్నమెంట్ యాప్స్, ఇ-సర్వీసెస్‌ని ప్రమోట్ చేసే క్రమంలో ఇది అత్యంత కీలకమైన అడుగు అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్స్ పేర్కొంది. దుబాయ్‌ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన స్మార్ట్ సిటీగా మలచేందుకు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఎంపిక చేసిన తేదీల్లో వినియోగదారులు, స్మార్ట్ ఛానల్స్ ద్వారా మాత్రమే గవర్నమెంట్ సర్వీసులు పొందగలుగుతారు. ఈ రోజుల్లో మ్యాన్డ్ సర్వీస్ సెంటర్స్ పనిచేయవు. బిల్స్ పేమెంట్, కస్టమర్ క్వరీస్ రిజిస్ట్రేషన్ వంటివన్నీ ఆన్‌లైన్‌లోనే లభ్యమవుతాయి. 2017 'ఎ డే వితౌట్ సర్వీస్ సెంటర్స్' కార్యక్రమాన్ని వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రారంభించారు. అది చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఈసారి వారం రోజులపాటు కేవలం ఆన్‌లైన్‌లోనే సేవల్ని అందుబాటులో వుంచడం ద్వారా, ఇంకా పెద్ద విజయాన్ని సాధించగలమని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెసిడెంట్స్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







