తన భార్య వంట తినలేం అంటున్న జూ.ఎన్టీఆర్
- October 07, 2018
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'అరవింద సమేత' చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రాధ కృష్ణ నిర్మించారు.
ఎన్టీఆర్ 'అరవింద సమేత' విడుదలకు కొన్ని రోజులే ఉండడంతో చిత్ర యూనిట్ తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబందించిన విషయాలే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో పిల్లలకి వంట చేసి పెట్టడం వంటి పనులు మీ భార్య ప్రణతినే చూసుకుంటారా..? అనే ప్రశ్న ఎదురైంది ఎన్టీఆర్ కు.
ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ చెప్పిన సమాధానం అందరినీ నవ్వించింది. 'ఏం మాట్లాడుతున్నారు మీరు.. మా ఆవిడ గురించి చాలా ఊహించుకున్నారు. అసలు ఆమెకి వంటే రాదు. పొరపాటున వండితే తిని పారిపోవాలంతే… మా ఇంట్లో నేనే మంచి వంటగాడ్ని. అన్ని వంటకాలు చేస్తాను. అమ్మ నాకన్నా బాగా వంట చేస్తుంది. మేం వండితే అమ్మా కొడుకులు తిని కూర్చుంటారంతే..' అన్నారు నవ్వుతూ.
ఇక ఎక్కువగా హరికృష్ణ గారితో గడిపిన చివరిక్షణాల గురించి చెప్పుకొచ్చాడు. 'నాన్న మరణానికి కొద్దీ రోజుల ముందు నాకు ఫోన్ చేసి పలావ్ కావాలని చెప్పారు. దీంతో షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళగానే స్పెషల్ గా పలావ్ చేసి నాన్నకు పంపించాను… చివరిసారిగా నాన్నగారికి అదే ఇచ్చాను' అని తెలిపాడు. ఇక తండ్రిని తలచుకొని తారక్ భావోద్వేగానికి లోనయ్యాడు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







