ముఠా కాల్పులు..భారతీయుడు మృతి
- October 08, 2018
బ్యాంకాక్: రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక భారతీయుడు, మరో విదేశీ పర్యటకుడు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయని బ్యాంకాంక్ పోలీసులు సోమవారం తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. రాంచదీవి జిల్లాలోని సెంటరా వాటర్‌గేట్ పెవిలియన్ హోటర్ వెనుక రహదారిలో ఆదివారం రాత్రి ఈ కాల్పులు చోటుచుసుకున్నాయని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ భారత్‌కు చెందిన గక్రేజ్ ధీరజ్ మరొక పర్యాటకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడ్డ ఐదుగురిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. భారత్‌కు చెందిన రెస్టారెంట్లో భారతీయులతో సహా, విదేశీ పర్యటకులు డిన్నర్ చేసి, వారి బస్సు కోసం పార్కింగ్ ప్రదేశంలో వేచి చూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వారు అక్కడ ఉండగానే స్నూకర్ క్లబ్ నుండి యువకుల బృందం రెండు వర్గాలుగా కూడా అక్కడకు చేరుకున్నాయని పోలీసు అధికారి తెలిపారు. అనంతరం వారి మధ్య కాల్పులు చోటుచేసుకున్నారయని తెలిపారు. పిస్టల్స్, కత్తులు, కర్రలతో ఉన్న సుమారు 20 మంది వ్యక్తులు క్లబ్ నుండి వీధిలోకి నడిచారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. కాగా, పోలీసులు వస్తున్న సమయానికి రెండు ముఠాలు పారిపోగా, వారిలో ఎవరూ పోలీసులకు చిక్కలేదు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







