ముఠా కాల్పులు..భారతీయుడు మృతి

- October 08, 2018 , by Maagulf
ముఠా కాల్పులు..భారతీయుడు మృతి

బ్యాంకాక్‌: రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక భారతీయుడు, మరో విదేశీ పర్యటకుడు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయని బ్యాంకాంక్‌ పోలీసులు సోమవారం తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. రాంచదీవి జిల్లాలోని సెంటరా వాటర్‌గేట్‌ పెవిలియన్‌ హోటర్‌ వెనుక రహదారిలో ఆదివారం రాత్రి ఈ కాల్పులు చోటుచుసుకున్నాయని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ భారత్‌కు చెందిన గక్రేజ్‌ ధీరజ్‌ మరొక పర్యాటకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడ్డ ఐదుగురిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. భారత్‌కు చెందిన రెస్టారెంట్‌లో భారతీయులతో సహా, విదేశీ పర్యటకులు డిన్నర్‌ చేసి, వారి బస్సు కోసం పార్కింగ్‌ ప్రదేశంలో వేచి చూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వారు అక్కడ ఉండగానే స్నూకర్‌ క్లబ్‌ నుండి యువకుల బృందం రెండు వర్గాలుగా కూడా అక్కడకు చేరుకున్నాయని పోలీసు అధికారి తెలిపారు. అనంతరం వారి మధ్య కాల్పులు చోటుచేసుకున్నారయని తెలిపారు. పిస్టల్స్‌, కత్తులు, కర్రలతో ఉన్న సుమారు 20 మంది వ్యక్తులు క్లబ్‌ నుండి వీధిలోకి నడిచారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. కాగా, పోలీసులు వస్తున్న సమయానికి రెండు ముఠాలు పారిపోగా, వారిలో ఎవరూ పోలీసులకు చిక్కలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com