ఔరా..! ఇదేమి వ్యాయామశాల

- October 08, 2018 , by Maagulf
ఔరా..! ఇదేమి వ్యాయామశాల

ప్రపంచం మారుతోంది.. మనుషులు మారిపోతున్నారు. అలాగే మనిషి క్రియేటివిటీ అమాంతం పెరిగిపోతుంది. సృజనాత్మకతతో మనిషి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలుగుతున్నాడు. అడవిలో ఉంటూ ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటున్నా ఓ వ్యక్తి సృజనాత్మకత చాలా మందిని ఆకట్టుకుంటుంది.

సాధించాలనే పట్టుదల ఉంటే మట్టిముద్ద కూడా మరబొమ్మగా మారిపోతుంది. ప్రకృతిలో ఉంటూ ప్రకృతిలో మమేకమైన అతను అవసరాలను కూడా వాటితోనే తీర్చుకోవాలనుకున్నాడు.అలాగే వ్యాయామ సాధనాలను తయారు చేసి వాటిపై వ్యాయమాలు చేస్తూ అందర్నీ అబ్బురపరుస్తున్నాడు వెదురు బొంగులు, మట్టిముద్దలను ఉపయోగించి వ్యాయమ పరికరాలను తయారుచేసి ఔరా అనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్‌గా మారింది. రెడీమేడ్ సాధనాలు ఉన్న జిమ్‌కు వెళ్ళి వ్యాయమాలు చేయడానికి బద్దకించే యువతకు ఈ వ్యక్తి ఆదర్శప్రాయుడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com