ఇకపై 24 గంటలు షాపింగ్ చేసుకోవచ్చు
- October 08, 2018
ఇండియా: మాల్స్, సినిమా హాళ్లు ఇకపై 24గంటలు తెరిచే ఉంటాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ మోడల్ లా ను పాస్ చేసింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో అదనంగా ఉపాధి, ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. యజమానులకు కూడా సంస్థలను నిర్వహించేందుకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చట్టం 365రోజుల సంస్థను నిర్వహించే సౌకర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ చట్టం మహిళలకు నైట్ షిఫ్ట్ చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. అయితే.. యజమానులు భద్రత పరంగా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా తాగునీరు, క్యాంటిన్ , ఫస్ట్ ఎయిడ్ లాంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించిన "ది మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్" బిల్ 2016 కి కేబినెట్ ఆమోదం తెలిపింది. మోడల్ లా కు పార్లమెంటు ఆమోదం అవసరం లేదు. దీన్ని లేబర్ మినిష్ట్రీ కేబినెట్ ముందుకు తీసుకువచ్చింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







