ఇకపై 24 గంటలు షాపింగ్ చేసుకోవచ్చు

- October 08, 2018 , by Maagulf
ఇకపై 24 గంటలు షాపింగ్ చేసుకోవచ్చు

ఇండియా: మాల్స్, సినిమా హాళ్లు ఇకపై 24గంటలు తెరిచే ఉంటాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ మోడల్ లా ను పాస్ చేసింది. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో అదనంగా ఉపాధి, ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. యజమానులకు కూడా సంస్థలను నిర్వహించేందుకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చట్టం 365రోజుల సంస్థను నిర్వహించే సౌకర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ చట్టం మహిళలకు నైట్ షిఫ్ట్ చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది. అయితే.. యజమానులు భద్రత పరంగా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా తాగునీరు, క్యాంటిన్ , ఫస్ట్ ఎయిడ్ లాంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించిన "ది మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్" బిల్ 2016 కి కేబినెట్ ఆమోదం తెలిపింది. మోడల్ లా కు పార్లమెంటు ఆమోదం అవసరం లేదు. దీన్ని లేబర్ మినిష్ట్రీ కేబినెట్ ముందుకు తీసుకువచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com