డీఆర్డీవోలో పనిచేస్తున్న పాక్ ఏజెంట్ అరెస్ట్
- October 08, 2018
భారతీయ రక్షణ సంస్థలో మరో అతిపెద్ద పొరపాటు వెలుగు చూసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉన్న డీఆర్డీవో యూనిట్ లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి చెందిన ఒక ఏజెంట్ ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఏజెంట్ బ్రహ్మోస్ యూనిట్ లో పని చేసేవాడు. ఈ గూఢచారి డీఆర్డీవోకి చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి అందజేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై నాగ్ పూర్ పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు యూపీ ఏటీఎస్ ఈ ఉదయం నాగ్ పూర్ లో మరో ఏజెన్సీతో కలిసి ఈ గూఢచారిని అరెస్ట్ చేసింది. ఈ ఏజెంట్ పేరు నిశాంత్ అగర్వాల్ అని తెలుస్తోంది. ఇతను నాగ్ పూర్ లోని డీఆర్డీవో యూనిట్ లో చాలా కాలంగా పని చేస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







