యూఏఈ టూర్ లోగో ఆవిష్కరణ
- October 08, 2018



దుబాయ్: నబూదా ఆటో మొబైల్స్ - ఆడి దుబాయ్ షోరూమ్‌లో, యూఏఈ టూర్ సుప్రీమ్ ఆర్గనైజింగ్ కమిటీ, కొత్త లోగోనీ విన్నర్ ట్రోఫీనీ ఆవిష్కరించింది. సెవెన్ సైడెడ్లో ఈ లోగో ఆకర్షణీయంగా రూపొందింది. అబుదాబీ, దుబాయ్, షార్జా, అజ్మన్, ఫుజారియా, రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ కువైన్ ఎమిరేట్స్ని ప్రతిబింబించేలా సెవెన్ సైడెడ్ లోగోని రూపొందించారు. దుబాయ్ టూర్, అబుదాబీ టూర్‌ని మెర్జ్ చేసి 2019లో దుబాయ్ టూర్ పేరుతో రేస్‌ని నిర్వహించబోతున్నారు. అబుదాబీ స్పోర్ట్స్ కౌన్సిల్ దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్, ఆర్సిఎస్ స్పోర్ట్‌తో కలిసి ఈ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు మొత్తం ఏడు ఎమిరేట్స్ని కలిపేలా ఈ రేస్ వుంటుంది. 5.5 కిలోల బరువుతో 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ ట్రోఫీ చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది. అబుదాబీ స్పోర్ట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ ఆరిఫ్ అల్ అవానీ, యూఏఈ సైక్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఒసామా అల్ షఫార్, ఆర్సిఎస్ స్పోర్ట్స్ డిఎంసిసి సిఇఓ ఎన్రికో ఫిలి, అల్ నబూదా ఆటోమొబైల్స్ ఆడి జనరల్ మేనేజర్ అలి అల్ నబూదా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







