టైల్ మానుఫ్యాక్చరర్కి జైలు, జరీమానా
- October 08, 2018
మస్కట్: ఒమన్‌లో ఓ ఇండస్ట్రియల్ టైల్ ఫ్యాక్టరీ ఓనర్‌కి పది రోజుల జైలు శిక్ష, 500 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింఇ న్యాయస్థానం. కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను ఈ చర్యలు తీసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) పేర్కొంది. బురైమిలోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ నిందితుడికి ఈ శిక్ష విధించింది. కన్స్యుమర్ ఒకరు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు కాగా, విచారణలో బాధితుడి ఆరోపణలు నిజమని తేలింది. ఒప్పందం ప్రకారం అందించాల్సిన టైల్స్‌లో ఒప్పందం మేరకు క్వాలిటీ లేదని తేలింది. దీంతో నిందితుడిపై ఆరోపణలు నిజమని తేల్చిన న్యాయస్థానం నిందితుడికి జరీమానా, జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







