ఇరాన్ నుండి చమురు దిగుమతులు కొనసాగించనున్న భారత్
- October 08, 2018
న్యూఢిల్లీ : అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ నవంబర్‌లో ఇరాన్ నుండి భారత్ చమురు దిగుమతిని కొనసాగిస్తుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఇరాన్ నుండి చమురు దిగుమతిలో ప్రధానమైనదిగా, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దారునిగా భారత్ ఉందని అన్నారు. 2017-18లో భారత్ దిగుమతి చేసుకున్న 220.4 మిలియన్ మెట్రిక్ టన్నుల (మిలియన్ టన్నుల) ముడి చమురులో ఇరాన్ వాటా 9.4 శాతంగా ఉంది.' మన దేశీయ అవసరాలు తీరాలి. ఇప్పటికే నవంబర్‌లో చమురు దిగుమతి కోసం తమ కంపెనీలు వాటి కోటా కోసం నామినేట్ అయ్యాయి' అని ప్రధాన్ తెలిపారు. 'ప్రపంచ నేతలు మా అవసరాలను అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం' అని ఢిల్లీలోని ఎనర్జీ ఫోరంలో ఆయన అన్నారు. నవంబర్ 4 నుండి ఇరాన్ చమురు దిగుమతిపై అమెరికా ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. గతవారం ఎక్సైజ్‌డ్యూటీ, ఇంధన ధరల తగ్గింపు మాట్లాడుతూ ఇవి చమురు ధరలను నియంత్రించలేవని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







